Day Wise Current Affairs in Telugu 01 June 2020 #UPSC

Daily Current Affairs in Telugu 01 June 2020

Learn day-wise current affairs National and International in Telugu. Daily one-liner current affairs Telugu June 2020, download April 2020 current affairs in English

Looking for Day wise current affairs in English, Click Here

Current Affairs in Telugu 1st June 2020 | తెలుగులో Current Affairs 1 June 2020

1) ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర కేబినెట్ 2020 జూన్ 1 వ తేదీ స‌మావేశ‌మైంది . ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో కేంద్ర ప్ర‌భుత్వం రెండ‌వ సంవ‌త్స‌రంలోకి అడుగిడిన అనంత‌రం జ‌రిగిన తొలి కేబినెట్ స‌మావేశం. ఈ స‌మావేశం సంద‌ర్భంగా దేశంలోని క‌ష్ట‌జీవులైన రైతులు, MSME రంగం, వీధి వ్యాపారులుగా ప‌నిచేస్తున్న‌వారి జీవితాల‌లో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావం చూపే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింది.

a) MSME నిర్వ‌చ‌నం ప‌రిధి మ‌రింత ఎగువ‌కు స‌వ‌ర‌ణ‌:

  • ఎం.ఎస్‌.ఎం.ఇ నిర్వ‌చ‌నానికి సంబంధించి మ‌రింత అనుకూల స‌వ‌ర‌ణ తెచ్చేందుకు భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప్యాకేజ్ ప్ర‌కారం, సూక్ష్మ త‌యారీ, స‌ర్వీసు యూనిట్ల‌కు సంబంధించిన నిర్వ‌చ‌నాన్ని 1 కోటిరూపాయ‌ల పెట్టుబ‌డికి, 5 కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌రుకు పెంచింది.
  • చిన్న యూనిట్ల ప‌రిమితిని రూ 10 కోట్ల పెట్టుబ‌డికి, రూ50 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు పెంచారు.
  • అలాగే , మ‌ధ్య‌త‌ర‌హా యూనిట్ల‌కు ప‌రిమితిని రూ 20 కోట్ల పెట్టుబ‌డి, రూ 100 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు పెంచారు.
  • 2006 లో ఎం.ఎస్‌.ఎం.ఇ అభివృద్ధి చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన త‌ర్వాత 14 సంవ‌త్స‌రాల‌కు ఈ రివిజ‌న్ తీసుకువ‌చ్చారు

b) Vendors Loan

వీధివ్యాపారులు, రూ10,000 వ‌ర‌కు వ‌ర్కింగ్ కేపిట‌ల్ లోన్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీనిని ఏడాదిలో నెల‌వారీ వాయిదాల రూపంలో తిరిగి చెల్లించ‌వ‌చ్చు.స‌కాలంలో, లేదా ముందుగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే వ‌డ్డీపై 7 శాతం వార్షిక స‌బ్సిడీని ల‌బ్దిదారు బ్యాంకు ఖాతాకు ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌ద‌లీ విధానం ద్వారా ఆరునెల‌ల ప్రాతిప‌దిక‌న జ‌మ‌చేస్తారు. ముందుగా తిరిగి చెల్లించే రుణంపై ఎలాంటి పెనాల్టీ ఉండదు.

2) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచే నిర్ణయాలు తీసుకుంది.

వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల చెల్లింపు గడువును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు పెంచింది.

రూ.3 లక్షల వరకు తీసుకున్న రుణాలకు సంబంధించి ఇప్పటికే బకాయి ఉన్నా; మార్చి 1, 2020 నుంచి ఆగస్టు 31, 2020 మధ్యకాలంలో బకాయిగా మారినా, గడువు పెంపు వెసులుబాటు వర్తిస్తుంది. దీనిపై బ్యాంకులకు 2 శాతం వడ్డీ రాయితీ ‍(IS), తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించే రైతులకు 3 శాతాన్ని ప్రోత్సాహకంగా (PRI) అందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

3) R K Chaturvedi ఆర్‌.కె.చతుర్వేది, 1987 బ్యాచ్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ‘కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ’కు చెందిన కెమికల్స్‌, పెట్రో కెమికల్స్‌ విభాగం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ బాధ్యతలకు ముందు.., కేంద్ర సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా ఆయన సేవలు అందించారు. సీబీఎస్‌ఈ ఛైర్మన్‌గా, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీఏ) డైరెక్టర్‌ జనరల్‌గానూ పని చేశారు.

4) ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ (ఐ.ఎం-పి.డి.ఎస్) పథకంలో ఒడిశా, సిక్కిం, మిజోరం అనే మరో మూడు రాష్ట్రాలను చేర్చుతున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు ప్రకటించారు.

ఈ వ్యవస్థలో, “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” ప్రణాళిక ద్వారా, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ రేషన్ కార్డుదారులకు తమ పేరుపై లభించే సబ్సిడీ కలిగిన ఆహార ధాన్యాల కోటాను ఈ-పి.ఓ.ఎస్. తో అనుసంధానమైన ఎఫ్.పి.ఎస్. నుండి ఈ-పి.ఓ.ఎస్. పరికరంలో ఆధార్ నెంబరును అనుసంధానించిన తర్వాత ఉన్న / అదే రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు.

ఈ సౌకర్యం ఇప్పటివరకు 17 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో అమలులోఉంది. అవి – ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా & నగర్ హవేలీ, డయ్యు & డామన్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, త్రిపుర మరియు ఉత్తరప్రదేశ్

5) 685 మంది భారతీయ పౌరులను తమిళనాడులోని టుటికోరిన్ నౌకాశ్రయానికి చేర్చడానికి భారత నావికాదళ షిప్ జలాశ్వ 01 జూన్ సాయంత్రం శ్రీలంకలోని కొలంబోలో బయలుదేరింది.

  • భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ వందే భారత్ ఆధ్వర్యంలో భారత నావికాదళ ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా ఈ నౌక ఇపుడు తన మూడవ పర్యటనలో ఉంది; విదేశాల నుండి సముద్ర తీరం ద్వారా భారతీయ పౌరులను ఇంటికి తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ఐఎన్ఎస్ జలాశ్వ 1st June 2020 ఉదయం కొలంబో నౌకాశ్రయంలోకి ప్రవేశించింది

6) జల జీవన్ మిషన్’ (ఇంటింటికీ నీరు) కార్యక్రమం కింద ఒడిశాకు రూ. 812 కోట్లు ఆమోదం

7) గ్రామీణ ఇళ్లన్నిటికీ 2022 డిసెంబరుకల్లా కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి మేఘాలయ ప్రణాళికలు

8) ఈపీఎఫ్ఓ పింఛ‌నుదారుల‌కు మ‌రింత మెరుగైన‌ పింఛ‌ను

  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (ఈపీఎఫ్ఓ) సిఫారసు మేరకు కార్మికుల దీర్ఘకాల డిమాండ్లలో ఒక‌టైన క‌మ్యూటెడ్ వాల్యూ పింఛ‌ను విధా‌నం పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌న స‌మ్మ‌తి తెలిపింది.
  • అంతకుముందు క‌మ్యూటెడ్ వాల్యూ పింఛ‌ను విధానం పునరుద్ధరణకు ఎటువంటి ఏర్ప‌ట్లు లేవు. జీవిత కాలపు క‌మ్యూటేష‌న్ కార‌ణంగా పింఛ‌న‌ర్లకు త‌గ్గించిన పింఛ‌న్ల‌ను పొందుతూ వ‌స్తున్నారు.

9) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా ప్రదీప్ కుమార్ త్రిపాఠి, ఐఏఎస్ (Jammu and Kashmir Carde, 1987) సోమ‌వారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ త్రిపాఠి కేంద్ర ప్ర‌భుత్వపు సిబ్బంది మరియు శిక్షణా విభాగంలో (డీఓపీటీ) ప్రత్యేక కార్యదర్శి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్‌గా ఆయ‌న సేవ‌లందించారు

For English Version, Click Here

Download daily talent current affairs news for UPSC exam quiz question and answers in our monthly current affairs edition ebook. Fdaytalk, #1 Free Learning Website

Learn More

Link: Download Monthly Current Affairs eBook 2020

Link: Updated GK 2020 Download

Link: Daily Newspapers Download

Download our mobile app, for daily current affairs for all exam. Top 10 current affairs and General knowledge and bank current affairs question and answers ebooks

Source: PIB

Comments

iQOO Neo9S Pro vs Neo9 Pro: Key Upgrades vivo Launches Y200 GT, Y200, and Y200t; Starting at Rs.14,000* Sony Xperia 1 VI- SD 8 Gen 3, 4K OLED and Higher Zoom camera Best Free Movie Streaming Sites with No Sign-Up New ChatGPT-4o Can Teach Maths, Understand Emotions and Flirt