Current Affairs Telugu

తెలుగు కరెంటు అఫైర్స్ 10 జూన్ 2021

Current Affairs Telugu 10 June 2021

Learn Fdaytalk Current Affairs in Telugu 10 June 2021 National and International. Daily News, GK and Current Events updates in fdaytalk. Download Telugu Current Affairs ebook PDF monthly.

తెలుగు కరెంటు అఫైర్స్ 10 జూన్ 2021

1. తెలంగాణ హైకోర్టు జడ్జి ల సంఖ్య పెంపు, 24 నుంచి 42.

  • తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు జడ్జి ల సంఖ్య ను 24 నుంచి 42 కు పెంచింది.
  • 42 మంది లో 32 మంది శాశ్వత జడ్జిలు గా మరియు 10 మంది అదనపు జడ్జిలు గా ఉండనున్నారు.
  • ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జెస్టిస్: N . V రమణ
  • ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు కోర్టు చీఫ్ జెస్టిస్: హిమ కోహ్లీ (Hima Kohli)

2. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 2021

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో టీం ఇండియా క్రికెటర్లు టాప్ 10 లో నిలిచారు. విరాట్ కోహ్లీ 814 పాయింట్ల 5వ స్థానం మరియు రిషబ్ పంత్ 747 పాయింట్లు తో 6వ స్థానం రోహిత్ శర్మ 747 పాయింట్ల తో 7 స్థానం లో నిలిచారు.
  • మొదటి మూడూ స్థానాల్లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్స్, ఆస్ట్రేలియా చెందిన స్టీవ్ స్మిత్ మరియు మార్నేస్ లబుషెన్ నిలిచారు.

3. క్వాకరెల్లి సైమండ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2022.

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు క్వాకరెల్లి సైమండ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2022 (Quacquarelli Symonds (QS) World Rankings 2022) లో world’s top research university గ నిలిచింది.
  • మొత్తం ర్యాంకింగ్స్‌లో, ఐఐఎస్‌సి భారతదేశంలో మూడవ ఉత్తమ సంస్థగా నిర్ణయించబడింది, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బొంబాయి మరియు ఐఐటి ఢిల్లీ ల్లీ వరుసగా మొదటి మరియు రెండవ స్థానాల్లో నిలిచాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు సంస్థలు – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా మొదటి, రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచాయి.
  • క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022 లో ఐఐటి- బొంబాయి 177 వ స్థానాన్ని, ఐఐటి- ఢిల్లీ 185 వ స్థానంలో, ఐఐఎస్సి- బెంగళూరు 186 వ స్థానంలో నిలిచాయి
  • సిటేషన్స్ పర్ ఫ్యాకల్టీ (సిపిఎఫ్) విభాగం లో ఐఐఎస్సి బెంగళూరు 100 కి 100 (100/100) స్కోర్ సాధించింది. ఇప్పటివరకు ఇండియన్ యూనివర్సిటీ ఏవి కూడా ఏ అంశం లోను 100 కి 100 (100/100) స్కోర్ సాధించలేదు.

4. స్టేషన్లలో మరియు రైళ్ళలో ప్రజల భద్రత మరియు భద్రతా సేవల (public safety and security services) కోసం 700 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 5 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను భారతీయ రైల్వేకు కేటాయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • దేశీయం గా అభివృద్ధి అయినటువంటి ట్రేన్ కలిఝన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టిసిఎఎస్) కు భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపింది. ఇది రైలుబండి ప్రమాదం బారిన పడకుండా కాపాడడం లో సాయపడనుంది. అంతేకాకుండా దీని వల్ల ప్రయాణికుల భద్రత కు కూడా పూచీ లభిస్తుంది.

5. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) కోసం కొత్త పెట్టుబడి విధానం (ఎన్‌ఐపి) 2012 యొక్క వర్తమానతను విస్తరించడానికి ఎరువుల శాఖ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి ఇచ్చింది.

  • ఆర్ఎఫ్ సిఎల్ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. దీని ని నేశనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీయర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్), ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ సిఐఎల్) లు కలసి ఏర్పాటు చేశాయి

6. మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ 2021-22 మార్కెటింగ్ సీజ‌న్‌లో అధీకృత ఖరీఫ్ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.

  • నువ్వు పంట మద్దతు ధర (క్వింటాలుకు రూ.452) అత్యధికంగా పెంచుతూ కమిటీ సిఫారసు చేసింది.
  • కంది, మినప పంటలకు అత్యధికంగా (క్వింటాలుకు రూ.300 వంతున) పెంచాలని సూచించింది.

7. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ & ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అవగాహన ఒప్పందం

  • స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ‘డిమాండ్ ఆధారిత టెలీ అగ్రికల్చర్ సలహాలను’ అందించడం ద్వారా రైతులకు సౌకర్యాలు కల్పించడానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డిఐసి), ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి.
  • ఢిల్లీలోని కృషి భవన్‌లో బుధవారం ఈ ఒప్పందం కుదిరింది.

8. భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే నియామకం

  • 1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండేను భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు.
  • ప్రస్తుత ముఖ్య ఎన్నికల కమిషనర్: సుశీల్ చంద్ర

Learn More

Link: Download Telugu Current Affairs

Comments